వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన లో కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన లో రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ ఘటన పై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డి పై వేటు వేసింది. ఆయనను డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పరిగి కొత్త డీఎస్పీ గా శ్రీనివాస్ ను నియమించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ పై అధికారులపై ఇటీవలే దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
మరోవైపు ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీ ని కూడా సస్పెండ్ చస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ సెక్రటరీ కలెక్టర్ దాడి పై బీఆర్ఎస్ నేతలను ఉసిగొలిపినట్టు సమాచారం. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేసింది.