నేడు మూడో రోజు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

-

నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. రెండు రోజుల సెలవుల తరువాత ఏపీ అసెంబ్లీ, మండ‌లి స‌భు లు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉద‌యం 9 గంటల ఏపీ అసెంబ్లీలో ప్రస్నోత్తారాలు ప్రారంభం అవుతాయి. అలాగే నేటి సభలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన నర్సరీలు క్రమబద్దీకరణకు సవరణ బిల్లు ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రవేశ పెట్టనుంది.

దీంతో పాటు వెనుకబడిన తరగతుల కులాల వారిగా జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానాన్ని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బీసీ జ‌న‌గ‌ణ‌న తీర్మానాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి పంపనుంది. అలాగే బీసీ,ఎస్సి,ఎస్టీ , మైనార్టీల సంక్షేమం బిసి జనగణనపై షార్ట్ డిస్కషన్ ఉంటుంది. అయితే ఈ స‌మావేశాల‌కు ప్ర‌తి ప‌క్ష టీడీపీ ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు దూరంగా ఉండ‌నున్నారు. టీడీపీ అధినేత కు అసెంబ్లీ లో అవ‌మానం జ‌రిగన దానికి నిర‌స‌న గా రెండు స‌భ‌ల‌కు టీడీపీ దూరంగా ఉంటుంది. అలాగే వ‌ర‌ద ప్ర‌భావం ఎక్కువ గా ఉన్న ఎమ్మెల్సే లు ఎమ్మెల్సీలు మంత్రులు కూడా ఈ స‌మావేశాల కు రాకుండా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో ప‌ర్య‌టించాలని సీఎం జ‌గ‌న్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news