ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గం…చాలా వైవిధ్యమైన తీర్పు వచ్చే స్థానం..ఆదరిస్తే వరుసగా ఒకే పార్టీని ఆదరించడం నిర్మల్ ప్రజలకు అలవాటు. మొదట నుంచి ఈ స్థానం గురించి మాట్లాడుకుంటే మొదట్లో రెండుసార్లు ఇక్కడ సోషలిస్ట్ పార్టీ గెలిచింది. ఇక 1962 నుంచి 1978 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక 1983 నుంచి 1994 వరకు ఇక్కడ టిడిపి హవా నడిచింది. వరుసగా నాలుగు ఎన్నికల్లో గీలిచింది. 1999, 2004 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది.
ఇక 2009 ఎన్నికల్లో కొత్తగా ప్రజారాజ్యం గెలవడం విశేషం..ప్రజారాజ్యం నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. ఇక 2014లో బిఎస్పి గెలిచింది..బిఎస్పి నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. ఈయనే 1999, 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2009లో ఓడిపోయారు..2014 ఎన్నికల్లో ఈయనకు కాంగ్రెస్ నుంచి సీటు రాకపోవడంతో.బిఎస్పి కు వెళ్ళి పోటీ చేసి గెలిచారు. అలా గెలిచాక ఈయన బిఆర్ఎస్ లోకి జంప్ చేశారు. అలాగే కేసిఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యారు.
2018 ఎన్నికల్లో ఇంద్రకరణ్ బిఆర్ఎస్ నుంచి గెలిచారు..మళ్ళీ మంత్రి అయ్యారు. ఇప్పుడు నిర్మల్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంద్రకరణ్కు పోటీగా కాంగ్రెస్ నేత ఏలేటి ఉన్నారు. వీరి మధ్య పోరు రసవత్తరంగా సాగేలా ఉంది. అయితే ఇప్పుడుప్పుడే ఇక్కడ బిజేపి బలపడుతుంది.
గత ఎన్నికల్లో నిర్మల్ లో బిజేపి పెద్దగా ప్రభావం చూపలేదు. ఓ 16 వేల ఓట్లు మాత్రం తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆ బలం మరింత పెంచుకున్నట్లు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ బలం కూడా పెరుగుతుంది. దీంతో ఈ సారి నిర్మల్ లో త్రిముఖ పోరు జరిగేలా ఉంది. మరి ఈ పోరులో ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ లేదా బిజేపి చెక్ పెడుతుందేమో చూడాలి.