మునుగోడు పోరు: కమలానికి కారు ప్లస్..!

-

అసలు ఉపఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీ గెలవడం అనేది పెద్ద సంచలమైన విషయం…అది కూడా ప్రధాన ప్రతిపక్షం కాని పార్టీ…అంటే ఈ పరిస్తితి రావడానికి పూర్తి కారణం…అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైపు జనాలు మొగ్గు చూపకపోవడం…ఈ పరిస్తితులే…తెలంగాణలో బీజేపీ బలపడానికి కారణం…అలాగే ఉపఎన్నికల్లో గెలవడానికి కారణమని చెప్పొచ్చు.

అయితే ఈ రెండు పాయింట్లే ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి ప్లస్ కానున్నాయి. మామూలుగా మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు…ఏదో గత ఎన్నికల్లో 12 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు కోల్పోయింది..అలాంటి పార్టీ ఇప్పుడు మునుగోడులో పాగా వేసే దిశగా వెళుతుంది. ఎలాగో బలమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రానుండటం పెద్ద ప్లస్. ఆయన ఇమేజ్ బీజేపీకి కలిసి రానుంది.

కోమటిరెడ్డి ఇమేజ్ పైనే బీజేపీ గెలిచేస్తుందా? అంటే కష్టమనే చెప్పాలి….అలా అని మునుగోడులో బీజేపీకి ప్రత్యేకమైన బలం లేదు…మరి అలాంటప్పుడు బీజేపీ గెలిచేది ఎలా అని అనుకోవచ్చు. మునుగోడులో బీజేపీని గెలిపించేది అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే అని తెలుస్తోంది. ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగింది…మునుగోడులో కూడా అదే పరిస్తితి…పైగా అక్కడ టీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నిలబెడతారని తెలుస్తోంది.

ఈయనపైనే తీవ్ర వ్యతిరేకత ఉంది…సొంత పార్టీ వాళ్లే ఈయనని వ్యతిరేకిస్తున్నారు..పైగా గతంలో ఎమ్మెల్యేగా ఈయన మునుగోడుకు చేసింది ఏమి లేదు. అంటే టీఆర్ఎస్ మైనస్ పాయింట్లే కమలం పార్టీకి ప్లస్ కానున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వీక్ అవ్వడం కూడా బీజేపీకి కలిసి రానుంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెనుక చాలావరకు కాంగ్రెస్ శ్రేణులు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. దీంతో మునుగోడులో కాంగ్రెస్ గెలుపు చాలా కష్టం. ఎటు చూసుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కమలం పార్టీకి ప్లస్ అయ్యేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version