తెలంగాణ భవిష్యత్ కోసం ఎన్నిక జరగబోతోంది : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

-

తెలంగాణలో ఒక్కసారి రాజకీయాలు వేడెక్కాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇటు కాంగ్రెస్‌ పార్టీకి, అటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలోనే.. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ పాలన, అవినీతి పరిపాలన పోవాలనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని అన్నారు రాజగోపాల్‌ రెడ్డి. ఈ నెల 21వ తేదీన మునుగోడు మండల కేంద్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని, ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు రాజగోపాల్‌ రెడ్డి.

మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై, సభను విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు రాజగోపాల్‌ రెడ్డి. తెలంగాణ భవిష్యత్ కోసం ఎన్నిక జరగబోతోందని, మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పునివ్వాలని కోరారు రాజగోపాల్‌ రెడ్డి. తనపై ఆరోపణలు చేసిన వారు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అయినా 25 రోజుల నుంచి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు రాజగోపాల్‌ రెడ్డి. తనపై వస్తున్న అసత్య ప్రచార విషయంలో మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు రాజగోపాల్‌ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version