టీవీ5 సాంబ అడ్డగోలు ఆదాయానికి చెక్.. ఫోర్జరీ సంతకాలతో చీటింగ్..

-

టీవీ స్క్రీన్ ముందు కూర్చుని నీతులు వల్లించే టీవీ5 సాంబా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.. అధికార పార్టీపై నిరంతరం బురద చల్లే ఈ నెంబర్ వన్ జర్నలిస్టుకి హెచ్పీసీఎల్ అధికారులు ఝలక్ ఇచ్చారు..

మీడియా రంగంలో ఆయన ఒక్కడే నీతిమంతుడు.. మిగిలిన వాళ్ళందరూ అవినీతిపరులు అనేలా బిల్డప్ ఇచ్చే టీవీ 5 సాంబ అవినీతి బాగోతం బయటకు వచ్చింది.. మాదాపూర్ లో ఓ విలువైన ల్యాండ్ ని ఓనర్ కు తెలియకుండా ఫోర్జరీ చేసి అందులో పెట్రోల్ బంకును నిర్వహిస్తున్నాడు.. ఈ క్రమంలో ల్యాండ్ ఓనర్ ని పలుమార్లు బెదిరించి పెట్రోల్ బంకును నిర్వహిస్తున్నాడని.. అధికారులు గుర్తించారు.. ల్యాండ్ ఓనర్ మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేయగా.. అయ్యగారి అవినీతి బాగోతం బయటకు వచ్చింది..

అసలు విషయం ఏంటంటే.. మాదాపూర్ లో విలువైన స్థలం ఉంది.. ఆ స్థలాన్ని ఓనర్ కు తెలియకుండా ఫోర్జరీ చేసి అందులో పెట్రోల్ బంకును టీవీ5 సాంబ ఏర్పాటు చేశాడు. అయితే అది ఆక్రమిత స్థలమని.. పెట్రోల్ బంకును ఖాళీ చేయాలంటూ పలుమార్లు అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.. అయితే ఆయన అధికారుల మాటను పెడచెవిన పెట్టడంతో.. స్థలానికి సంబంధించిన ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రూపాయి పెట్టుబడి లేకుండానే టీవీ ఫైవ్ సాంబ పెట్రోల్ బంక్ ని ఏర్పాటు చేసుకొని లక్షలు సంపాదిస్తున్నాడని.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఓనర్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో హెచ్పీసీఎల్ అధికారులు ఆక్రమిత బంక్ స్థలాన్ని సీజ్ చేశారు.. నిరంతరం నీతులు వల్లించే టీవీ5 సాంబ.. ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడంపై మీడియాలో లోకం అగ్రహం వ్యక్తం చేస్తుంది. సమాజం గౌరవించే జర్నలిజం వృత్తిలో ఉంటూ.. ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటని పలువురు సీనియర్ జర్నలిస్టులు మండిపడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version