టీఆర్ఎస్‌‌లో ట్విస్ట్‌లు..సీట్లు మారిపోతున్నాయా?

-

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయో క్లారిటీ లేకుండా ఉంది…అసలు వాస్తవానికి చూసుకుంటే 2023 చివరిలో ఎన్నికలు జరగాలి…కానీ ఈ సారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ముందస్తు ఎన్నికలపై అధికార పార్టీ నుంచి ఎలాంటి విషయం బయటకు రావడం లేదు గాని….ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతున్నాయి. కేసీఆర్ మరొకసారి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని, కాబట్టి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు.

అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి….ఇక పరోక్షంగా అధికార టీఆర్ఎస్ సైతం నెక్స్ట్ ఎన్నికల టార్గెట్ గానే రాజకీయం చేస్తుందని అర్ధమవుతుంది…ఈ సారి కూడా గెలిచి అధికారం దక్కించుకోవాలనేది టీఆర్ఎస్ ప్లాన్…ఆ దిశగానే టీఆర్ఎస్ పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటినుంచే టీఆర్ఎస్ లో సీట్ల విషయంపై చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇవ్వరని ప్రచారం జరుగుతుంది.

ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సైతం తన సీటు మార్చుకుంటారని తెలుస్తోంది. ఆయన ఈ సారి గజ్వేల్ నుంచి కాకుండా మెదక్ పార్లమెంట్ నుంచి బరిలో దిగుతారని తెలిసింది. ఈ సారి కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కేసీఆర్….పార్లమెంట్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో పార్లమెంట్ తో పాటు మరొక అసెంబ్లీ స్థానంలో కూడా పోటీ చేయొచ్చని తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీలో పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది.

అటు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో వంటేరు ప్రతాప్ రెడ్డి బరిలో దిగవచ్చని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి…ఈ సారి దుబ్బాక నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇలా పార్టీలో కొందరు సీట్లు మారనున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి టీఆర్ఎస్ లో ఇంకెన్ని ట్విస్ట్ లు వస్తాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version