ఎమ్మెల్సీ పోరులో ఊహించని ట్విస్ట్…కారుకు షాక్ ఇస్తారా?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పరిస్తితి దినదిన గండంగా మారిపోయింది. మొన్నటివరకు ఏ ఎన్నికల్లోనైనా తమకు తిరుగులేదని కారు పార్టీ భావించింది. అసలు తమకు ఓటమి రాదనే విధంగా ముందుకెళ్లింది. తీరా చూస్తే గెలుపోటములు సహజమే అనే విధంగా కేసీఆర్ మాట్లాడే పరిస్తితి వచ్చింది. కేసీఆర్ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే. అసలే దుబ్బాక ఉపఎన్నికలో ఓడిపోయారు….ఇక హుజూరాబాద్‌లో సైతం కారు పార్టీ చిత్తు అయింది. ఈటల రాజేందర్ దెబ్బకు చేతులెత్తేసింది.

TRS-Party | టీఆర్ఎస్

ఇక్కడ నుంచి టీఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చింది…ఇప్పుడు ఏ ఎన్నికలైన ఆచి తూచి అడుగేయాల్సిన పరిస్తితి ఉంది. అందుకే టీఆర్ఎస్ ప్రతి ఎన్నికని జాగ్రత్తగానే ఎదురుకునేందుకు సిద్ధమవుతుంది. ఇక టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ కూడా రెడీ అవుతుంది. ఇప్పటికే పలు రకాలుగా షాకు ఇచ్చిన బీజేపీ…ఇంకా మున్ముందు టీఆర్ఎస్‌కు షాకులు ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు పార్టీకి షాక్ ఇవ్వాలని కమలం చూస్తోంది.

తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది. అయితే టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేల బలం పూర్తిగా ఉంది కాబట్టి….ఆరు టీఆర్ఎస్ ఖాతాలోనే పడనున్నాయి. అలాగే స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అయితే స్థానిక సంస్థల్లో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. కానీ కొన్ని స్థానాల్లో బరిలో దిగి క్రాస్ ఓటింగ్ చేయించుకుని టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తుంది. అలాగే టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ సీట్లు దక్కని అసంతృప్తి నేతలని బీజేపీలోకి తీసుకొచ్చి సీటు ఇచ్చి నిలబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్ధులని పెట్టాలని చూస్తోంది. అటు కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల పోటీకి దిగేలా ఉంది. అంటే స్థానిక సంస్థల కోటాలో క్రాస్ ఓటింగ్ జరిగిందంటే కారు మునగడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version