యూపీలో గణనీయంగా తగ్గిన నేరాలు సీఎం యోగిని ప్రశంసించిన కేంద్ర మంత్రి గడ్కరీ యూపీలో 10 NH ప్రాజెక్టులకు శంకుస్థాపన

-

రెండవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక యోగి అదిత్యనాథ్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. నేరాలను అదుపు చేయడంలో, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో యోగి చాలా డేరింగ్ గా పనిచేశారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ యూపీలో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేశారు. మాఫియాలకు ఎప్పటికప్పుడు కళ్లెం వేసిన యోగి మురికివాడలను శుభ్రం చేయించి ముఠాల చేతుల్లో ఇరుక్కుని నలిగిపోతున్న అభాగ్యులకు విముక్తి కల్పించారు. అటు రైతులకు అన్నివిధాల సాయపడుతూ వారికి వెన్నుదన్నుగా నిలిచారు యోగి. మహిళలు ధైర్యంగా ఉండేలా శాంతి భద్రతలను మెరుగు పరిచారు. సన్యాసి ఏం చేయగలడు అని హేళన చేసిన వారంతా ఇప్పుడు ఆయనంటే భయపడుతున్నారు. బెదిరింపులకు,దౌర్జన్యాలకు దిగాలంటే యోగీ ని గుర్తుకు తెచ్చుకుని హడలిపోతున్నారు.

కేవలం మాఫియాలను గడ గడలాడిoచడమే రాష్ట్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అటు కేంద్రం అందించే పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున నూతన స్కీములను రూపొందించి ప్రజలకు చేరువయ్యారు అదిత్యనాథ్. సంక్షేమ పథకాల్లో మహిళలకి అగ్రప్రధాన్యం ఇచ్చారు. అంతేకాదు కొత్త ప్రాజెక్టులు తెచ్చి రాష్ట్ర సర్వముఖోభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ … యోగి పాలనపై ప్రశంశలూ కురిపించారు. మునుపెన్నడూ లేనివిధంగా యూపీని సరికొత్తగా యోగి నిర్మిస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం పనితీరుకి మెచ్చి కేంద్రప్రభుత్వం మరిన్ని కొత్త ప్రాజెక్టులను యూపీకి తీసుకువస్తోందని గడ్కరీ అన్నారు. సోమవారం ప్రతాప్ఘడ్ ప్రాంతంలో పర్యటించిన గడ్కరీ 10 జాతీయ రహదారులకు సంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ అదిత్యనాథ్ ని ఆకాశానికెత్తేశారు.వారణాసి కి వచ్చిన పలువురు విదేశీయులు సైతం యోగీ పనితీరుపై ప్రశంశలు కురిపించారని గుర్తు చేశారు.నేరస్తులను అణచివేసిన తీరు చాలా గొప్పదని కొనియాడారు. మోడీ కలల భారతాన్ని నిర్మించడంలో యోగీ ముందున్నారని కితాబిచ్చారు.

2025లో, ప్రయాగ్‌రాజ్‌లో గొప్పదైన దైవిక కుంభం నిర్వహించబోతున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతాప్‌గఢ్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు అనుసంధానం చేస్తు నాలుగు లైన్ల రోడ్డు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు.ఈ సందర్భంగా యోగి కూడా గడ్కరీ ని పొగడ్తలతో ముంచెత్తారు.G20 సదస్సు మరియు వారణాసి పర్యటన గురించి సీఎం మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వారణాసికి వచ్చిన విదేశీ ప్రతినిధులు అక్కడి నాలుగు లైన్ల రహదారులను చూసి “పొంగిపోయారని” అన్నారు. “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ నేడు అభివృద్ధి మరియు శాంతిభద్రతల నమూనాగా ఉద్భవించిందని,ఎవరి అసాంఘిక కార్యకలాపాలను నిలిపివేశామో వారే నేడు యూపీ శాంతిభద్రతలను ప్రశ్నిస్తున్నారని గుర్తుచేశారు. శాంతిభద్రతలు లేకుంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ. 35 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి కావు అని సెలవిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version