ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో యూపీదే అగ్రభాగం-సీఎం యోగీ

-

ఉత్తర ప్రదేశ్‌ని అన్ని రంగాల్లో ముందుంచాలని తపన పడుతున్నారు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌. రాష్ర్టాన్ని ఆర్థికంగా అగ్రపథాన నిలిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ర్టంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా ఉద్యమి మిత్రలను ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగి లక్నోలోని లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 102 ఉద్యమ మిత్రలకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను ఆయన అందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉద్యమి మిత్రలు ముఖ్యపాత్ర పోషించాలని సీఎం సూచించారు.

ఉద్యమ మిత్ర పోస్టులకు మొత్తం 1500 దరఖాస్తులు వచ్చాయి.అందులో 105 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.వీరిలో 87 మంది పురుషులు కాగా 18 మంది మహిళలు ఉన్నారు.మరో 15 మంది దరఖాస్తుదారులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో యూనివర్శిటీ ఆఫ్ వేల్స్, UK, IIM లక్నో, IIM ఇండోర్, BHU, IIIT-అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) మరియు NIT ప్రయాగ్‌రాజ్‌తో సహా అగ్రశ్రేణి విద్యా సంస్థల నుండి గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వారందరినీ సీఎం యోగి అభినందించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యమి మిత్రలు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 25 కోట్ల మంది ప్రజల అవసరాలను గుర్తుంచుకోవాలని,రాష్ర్టాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి అచంచలమైన నిబద్ధత,అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో అందుకున్న సుమారు ₹35 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను అమలు చేయడానికి పారిశ్రామికవేత్తలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం ఉద్యమ మిత్రలు పనిచేయనున్నారు.రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని,ఉద్యోగావకాశాలు కల్పించాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులను ఉత్తరప్రదేశ్‌లో వినియోగించాలని పారిశ్రామికవేత్తలను సీఎం కోరారు.

ఉద్యమి మిత్రలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ- జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నారని అన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో, ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను మరింతగా పెంచేందుకు బలంగా సహకరించాలన్నారు. మూడు సంవత్సరాల విజయవంతమైన పదవీకాలం తర్వాత, వివిధ పారిశ్రామిక అభివృద్ధి అధికారులు లేదా ప్రభుత్వంలో సేవలో చేరడానికి ఇష్టపడే ఏ ఉద్యమి మిత్రకైనా వయస్సు సడలింపు మరియు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వబడుతుందని సీఎం స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version