వాసాల‌మ‌ర్రికేనా.. మాకూ ఇవ్వండిః కేసీఆర్ పై కొత్త డిమాండ్‌

-

అదేంటో గానీ ఈ మ‌ధ్య కేసీఆర్ ఓ విష‌యంలో మాత్రం విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అస‌లే ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారంతో ప్ర‌తిప‌క్షాల‌న్నీ దుమ్మెత్తి పోస్తుంటే వాటిని తిర‌గి కొట్టాల‌ని ఆయ‌న వ‌రుస‌గా మీటింగులు, జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేప‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో నిన్న వాసాల‌మ‌ర్రి ఊరికి వెళ్లి వ‌రాల వ‌ర్షం కురిపించారు.

ఇక్క‌డే ఆయ‌న ఓ మాట చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెలంగాణను బంగారు తెలంగాణ చేయటమే తన లక్ష్యమని ఎన్నోసార్లు చెప్తూ ఆ నినాదాన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ నినాదాన్ని ఆయ‌నే దెబ్బేసుకోవటం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇప్ప‌టికే ఆయ‌న వాసాల మ‌ర్రి ఊరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి సంచ‌ల‌నంగా మారారు. అయితే నిన్న వెళ్లి ఊరికి దాదాపు కోట్లలో నిధుల ఇస్తాన‌ని, ఊరిని అద్భుతంగా డెవ‌ల‌ప్ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదే ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. తెలంగాణ‌లో వంద‌ల‌ గ్రామాల‌కు క‌నీసం రోడ్లు కూడా లేవ‌ని, కానీ చింత‌మ‌డ‌క‌కు, ఇప్పుడు వాసాల మ‌ర్రికి ఇన్నికోట్లు ఇస్తారా అంటూ విమ‌ర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version