జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్‌.. ఎందుకింత మార్పు?

-

ఎవ‌రు ఏమ‌న్నా పెద్ద‌గా స్పందించ‌ని కేసీఆర్‌.. గ‌తంలో కూడా ఎన్న‌డూ ప్ర‌గ‌తి భ‌వ‌న్ విడిచి వ‌చ్చిన సంద‌ర్భాలు కూడా త‌క్కువే. పార్టీ మీటింగ్ అయితేనే లేక‌పోతే పెద్ద స‌భ అయితేనో ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చేవారు. కానీ ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేశారో అప్ప‌టి నుంచి వ‌రుస‌గా జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బ‌లం క్ర‌మంగా పెరుగుతోంది. దీంతో ఆ పార్టీ 2023 టార్గెట్ గా అసెంబ్లీ ఎన్నికల‌పై ఫోకస్ పెడుతోంది. కాబ‌ట్టి ప్ర‌తిప‌క్షాల‌కు ఏమాత్రం చాన్స్ ఇవ్వొద్ద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక ఇప్పుడు హుజూరాబాద్‌లో గెల‌వాలంటే ఈట‌ల‌కు వ‌స్తున్న సానుభూతిని దెబ్బ‌కొట్టాల‌ని కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.

ఈ కార‌ణాల‌తోనే తన సహజశైలికి డిఫ‌రెంట్‌గా సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల కోసం కేసీఆర్ జిల్లాకు వ‌స్తార‌నే విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే హైదరాబాద్ వదిలి జిల్లాలకు ప‌య‌న‌మ‌య్యారు కేసీఆర్‌. మొత్తానికి ఈట‌ల రాజేంద‌ర్ ఎఫెక్ట్ కేసీఆర్‌లో బాగానే మార్పు తెచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version