సాయిరెడ్డి కౌంటర్లు..ప్రెజెంట్ హాట్ టాపిక్స్..ఎన్టీఆర్ ఫ్లెక్సీ కూడా !

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దూకుడు పెంచారు. ఎప్పటిలాగానే తన పదునైన ట్వీట్లతో ప్రత్యర్ధులపై కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. ఎవరిని వదలకుండా విరుచుకుపడుతున్నారు. ఆ కౌంటర్లు కూడా సున్నితంగా చురకలు అంటించేలా ఉన్నాయి. తాజాగా లోకేష్ యువగళం పాదయాత్రలో జయహో బి‌సి సభకు ఉదయభానుని యాంకర్‌గా పెట్టారు.  దీనిపై సాయిరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “యువగళంకి స్పందన కరువై, ఎవరూ గాలానికి చిక్కడం లేదనా…యాంకర్ గళాన్ని జోడించాడు లోకేష్! ఎన్నిపగటి కలలుకన్నా, డ్రామాలు వేసినా ప్రయోజనం లేదు బాబూ” అని ట్వీట్ చేశారు.

ఇక ప్రాజెక్టుల వద్దకు చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్ మొదలుపెట్టి..జగన్ పూర్తి చేసిన ప్రాజెక్టుల వద్ద బాబు నిద్రపోయి ఏం చేస్తారని సెటైర్ వేశారు. అలాగే ఇటీవల బి‌జే‌పి అధ్యక్షురాలు పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆమెపై కూడా సాయిరెడ్డి సెటైర్ వేశారు. విశాఖలోనే ఆమె ఫ్లెక్సీ గురించి మాట్లాడుతూ.. “ కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు…వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?” అని కౌంటర్ ఇచ్చారు.

అలాగే మాజీ మంత్రి నారాయణ..తనని వేధిస్తున్నాడని ఆయన తమ్ముడు భార్య ఆరోపణలు చేసిన నేపథ్యంలో..” వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు…నారాయణ! నారాయణ! నారాయణ!” అని ట్వీట్ చేశారు.

ఇటీవల లోకేష్ పాదయాత్రలో నెక్స్ట్ సి‌ఎం ఎన్టీఆర్ అని ఫ్లెక్సీ గురించి స్పందిస్తూ..” ‘అసలోడు’, ‘కొసరోడు’ అంతరార్థం ఏమిటో చంద్రబాబు గారే అధికారికంగా స్పష్టత ఇవ్వాలి. మీపార్టీలోని జూ.ఎన్టీఆర్ అభిమానులు ప్రకాశం జిల్లాలో కట్టిన ఫ్లెక్సీల్లో ‘అసలోడు’ వచ్చేవరకే ‘కొసరోడి’కి పండుగ అని రాసి ఉంది. ‘కొసరోడు’ అంటే ఆ జిల్లాలోయువగళం చేస్తున్న చినబాబు కాదు కదా? ప్రజలకు వచ్చిన సందేహాన్నే ప్రస్తావిస్తున్నాం.” అని ట్వీట్ చేశారు. ఇలా ప్రతి అంశంపై సాయిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version