వివేక్‌కు పగ్గాలు.. మునుగోడులో గేమ్ స్టార్ట్..!

-

అనుకున్నదే జరిగింది.. మునుగోడు ఉపఎన్నికకు ఇంచార్జ్ గా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని నియమించారు. మొదట నుంచి వివేక్‌కే మునుగోడు బాధ్యతలు వస్తాయని ప్రచారం జరుగుతూనే వచ్చింది. కాకపోతే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఇంచార్జ్ గా పనిచేసి బీజేపీ గెలుపుకు కృషి చేసిన జితేందర్ రెడ్డి సైతం..మునుగోడు బాధ్యతలు తీసుకోవాలని చూశారు. పైగా రెండుచోట్ల పార్టీ గెలిచింది.

కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం..వివేక్‌కు బాధ్యతలు ఇస్తే బెటర్ అని కోరారు. వివేక్ సైతం..మునుగోడు బాధ్యతలు కావాలని కోరారు. దీంతో బీజేపీ అధిష్టానం..వివేక్‌కు మునుగోడులో బీజేపీ గెలుపు బాధ్యతలని అప్పగించారు. అలాగే వివేక్ ఛైర్మన్‌గా 14 మంది నేతలతో కమిటీ వేశారు. ఈ కమిటీలో ఈటల రాజేందర్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గరికిపాటి మోహన్ రావు, స్వామిగౌడ్..ఇంకా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఇక మునుగోడులో వరుసగా మూడుసార్లు బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన గంగిడి మనోహర్ రెడ్డిని..సమన్వయకర్తగా నియమించారు.

అయితే ఎప్పుడు తెరవెనుక ఉంటూ బీజేపీ విజయాలకు కృషి చేస్తున్న వివేక్..ఇప్పుడు తెరముందుకు రానున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలో సమయంలో తెర వెనుక ఉండే అసలు కథ నడిపించారు. ఆర్ధికంగా, సామాజికంగా అండగా నిలిచారు. అలాగే తన సొంత మీడియాతో బీజేపీని హైలైట్ చేయించారు. ఇక ఇప్పుడు మునుగోడు బాధ్యతలు తీసుకున్న వివేక్..ఇప్పుడు ఏ స్థాయిలో పనిచేస్తారనేది చూడాలి.

కాకపోతే దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా మునుగోడు కాదు..ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేరు. పైగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. బలమైన పార్టీలకు చెక్ పెట్టి బీజేపీని గెలిపించడం అంత ఈజీ కాదు. అయితే వివేక్ ఎంట్రీతో మునుగోడులో దళిత ఓట్లు బీజేపీకి కలిసిరావచ్చు. అలాగే కాంగ్రెస్ నేతలతో తనకున్న పాతపరిచయాలని వాడుకోవచ్చు. అటు టీఆర్ఎస్‌లో కూడా పనిచేశారు కాబట్టి..అది కూడా ప్లస్ అవ్వోచ్చు. మరి చూడాలి మునుగోడులో వివేక్ బీజేపీని గెలిపిస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version