వక్ఫ్ బోర్డు బిల్లు నేడు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. నిన్న కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దిగువ సభలో ప్రవేశపెట్టగా 12 గంటల వాడీవేడి చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్ పాయి అయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
తాజాగా గురువారం ఉదయం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు.
చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉండగా.. మిత్రపక్షాలతో కలిపి బీజేపీకి 125 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో బిల్ పాస్ అవడం నామమాత్రమే అని తెలుస్తోంది.నేడు బిల్ పాస్ అనంతరం రాష్ట్రపతి ఆమోదం పొందాక వక్ఫ్ బోర్డు సవరణల చట్టం అమలులోకి రానుంది.