తెలుగు వర్సటైల్ హీరోయిన పూజా హెగ్డే ఒక్కసారిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి అధ్యాత్మిక జీవనంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. మొన్నటివరకు వరుస సినిమాలతో బిజీగా గడిపిన పూజా.. ప్రస్తుతం సినిమా ఆఫర్స్ లేక తీవ్రఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.సినిమా చాన్సుల కోసం ఎదురుచూపులు చూస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే ఆమె తన పేరిట పలు పూజలు చేయిస్తున్నట్లు సమాచారం.తన సినీ కెరీర్ బాగుండాలని ఆలయాలకు వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గురువారం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటి పూజా హెగ్డే దర్శించుకున్నారు.ఈ సందర్బంగా వేద పండితులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.