ఇవేం యాపారాలయ్యా….కామెడీ చేస్తున్నారుగా…

-

ఏపీలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టి‌డి‌పి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ ఈ రెండు పార్టీల మధ్య ఏదొక అంశం విషయంలో విమర్శల పర్వం నడుస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో కాస్త కామెడీ కూడా నడుస్తోంది. అది కూడా జగన్ ప్రభుత్వం చేసే వ్యాపారాలపై ప్రతిపక్ష టి‌డి‌పి బాగా కామెడీ చేస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వమే మద్య అమ్మడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ysrcpandtdp

అయితే మద్యపాన నిషేధం అని చెప్పి ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారు. అలాగే నాసిరకం మద్యం అమ్ముతున్నారు. ఇందులో ప్రతిపక్షాలు చేసే విమర్శలే కాదు…ప్రజలు చేసే విమర్శలు కూడా ఉన్నాయి. అయినా మద్యం విషయంలో జగన్ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. మద్యం విషయం పక్కనబెడితే..ఇటీవల జగన్ ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే సినిమా టికెట్ల అమ్మకానికి అనేక ప్రైవేట్ వెబ్‌సైట్స్ ఉన్నాయి…అయినా సరే ప్రభుత్వమే టికెట్లు అమ్మాలని డిసైడ్ అయింది.

దీనిపై ప్రతిపక్షాల నుంచే కాదు….న్యూట్రల్ వర్గాల నుంచి కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మడం ఏంటని ఎగతాళి చేస్తున్నారు. ఇదొక ఎత్తు అనుకుంటే ప్రభుత్వమే మటన్ అమ్మడానికి సిద్ధమవుతుందని వార్తలు వచ్చాయి. రేషన్ వ్యాన్లు ద్వారా ఇంటింటికి వెళ్ళి బియ్యం ఎలా పంపిణీ చేస్తున్నారో అలాగే…మటన్ కూడా అమ్మాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని వైసీపీ సొంత మీడియాలోనే కథనాలు వచ్చాయి. ఇక మటన్ తర్వాత ప్రభుత్వం చేపల అమ్మకాలకు కూడా సిద్ధమైందని ప్రకటన వచ్చింది.

ప్రతి గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణంలో చేపలు అమ్మేందుకు మినీ రిటైల్‌ మార్కెట్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి అప్పలరాజు చెప్పారు.  అయితే ఈ విషయాల్లో ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వం ఈ వ్యాపారాలని చేస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు…కానీ ప్రతిపక్ష టి‌డి‌పి నేతలు వీటిపై ఫుల్ సెటైర్లు వేస్తూ ఫుల్ కామెడీ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version