జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఆయన అక్కడ ఎవరిని కలుస్తున్నారు…? ఎం చేస్తున్నారు అనేది ఇప్పుడు బయటకు రావడం లేదు. అసలు ఆయన ఎవరిని కలవడానికి ఢిల్లీ వెళ్ళారు అనేది స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ నెలకొన్న పరిస్థితులు అమరావతి ప్రాంతంలో నెలకొన్న,
ఉద్రిక్త పరిస్థితులు అన్ని కూడా ఆయన కేంద్రానికి వివరించడానికి ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అమరావతి గురించి మాట్లాడటానికి ఢిల్లీ వెళ్లాలని భావించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం రాలేదని అంటున్నారు. వాళ్ళను కలవడానికి ఆయన సోమవారం కూడా ఢిల్లీలోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఆర్ ఎస్ ఎస్ పెద్దలతో,
పవన్ కళ్యాణ్ భేటి అయి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వాళ్ళను కలిసి పవన్ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయనకు కమలం పార్టీ పెద్దలెవ్వరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అయితే బిజెపిలో తన పార్టీ ని విలీనం చేయడానికి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారని, చంద్రబాబు సూచనతోనే ఆయన ఢిల్లీ విమానం ఎక్కారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.