తెలంగాణ రెడ్డి మంత్రుల్లో మళ్ళీ నెగ్గేది ఎవరు?

-

ఏపీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. రెడ్డి వర్గం డామినేషన్ ఇక్కడ రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉంది. పార్టీ ఏదైనా.. కొన్ని స్థానాల్లో హవా మాత్రం రెడ్డి వర్గానిదే. అలాగే ప్రభుత్వాల్లో వారి పాత్ర ఎక్కువగానే ఉంటుంది. ఇదే సమయంలో ప్రస్తుతం కే‌సి‌ఆర్ ప్రభుత్వంలో రెడ్డి వర్గానికి చెందిన మంత్రులే ఎక్కువ.

జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి..ఇలా ఆరుగురు మంత్రులు ఉన్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో రెడ్డి మంత్రుల్లో మళ్ళీ గెలిచి గట్టెక్కుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆరుగురు మంత్రులు మళ్ళీ గెలుస్తారా? లేక ఓటమి ఎదురవుతుందా? అనే చర్చ సాగుతుంది. ఇటీవల వస్తున్న కొన్ని సర్వేల ప్రకారం చూసుకుంటే..సూర్యాపేటలో వరుసగా గెలుస్తూ మంత్రిగా చేస్తున్న జగదీష్ రెడ్డి ఈ సారి కాస్త టఫ్ ఫైట్ ఎదుర్కోవాలని తెలుస్తుంది. సూర్యాపేటలో కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి కాస్త స్ట్రాంగ్ అవుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. దీంతో జగదీష్ రెడ్డి గట్టి పోటీ ఎదురుకోవాల్సి ఉంటుంది.

ఇక ఇంద్రకరణ్ రెడ్డి..నిర్మల్ నుంచి వరుసగా గెలుస్తూ మంత్రిగా ఉన్నారు. ఈయన కూడా ఈ సారి టఫ్ ఫైట్ ఎదురుకునే పరిస్తితి. కాకపోతే నిర్మల్ లో కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య ఓట్లు చీలితే ఇంద్రకరణ్‌కు లాభం జరిగే ఛాన్స్ ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం. ఇక మల్లారెడ్డి..మేడ్చల్ లో గత ఎన్నికల్లో 80 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా ఆయనకు తిరుగులేదని తెలుస్తుంది.

ప్రశాంత్ రెడ్డి బాల్కొండలో లీడ్ లోనే ఉన్నారు. కాకపోతే బి‌జే‌పి, కాంగ్రెస్ రేసులో ఉన్నాయి. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలితే ప్రశాంత్ రెడ్డికి బెనిఫిట్. నిరంజన్ రెడ్డి..వనపర్తిలో గట్టి పోటీ తప్పదు. సబితా ఇంద్రారెడ్డి..మహేశ్వరంలో పోటీ ఎదుర్కోవాల్సిందే. మొత్తానికి రెడ్డి మంత్రులు ఈ సారి టఫ్ ఫైట్ ఎదురుకోవాల్సిందే. మరి వీరిలో ఎవరు గట్టెక్కుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version