ఈటల రాజేందర్ ఎందుకు ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు?

-

మొన్నటివరకు ఈటల రాజేందర్ etela rajendar అంటే….కేసీఆర్ కుడిభుజం లెక్క. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు సపోర్ట్‌గా ఉన్న నాయకుడు ఈటల. అలా కేసీఆర్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే ఈటల…ఊహించని విధంగా కేసీఆర్ కేబినెట్‌ నుంచి బర్తరఫ్ అయ్యారు. ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో కేసీఆర్, ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించారు. దీంతో ఈటల కూడా టీఆర్ఎస్‌ని వీడి, బీజేపీలో చేరిపోయారు.

ఈటల రాజేందర్/ etela rajendar

అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలపడంతో హుజూరాబాద్‌కు ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని ఈటల చూస్తున్నారు. ఈటలని ఓడించి హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, ఈటల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈటల, పదే పదే మంత్రి హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు. ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేప్పుడే, హరీష్ రావు కూడా టీఆర్ఎస్‌లో అనేక అవమానాలు ఎదురుకుంటున్నారని అన్నారు. ఇక ఈటల చేసిన వ్యాఖ్యలను హరీష్ ఖండించడం కూడా జరిగింది. తాను టీఆర్‌ఎస్‌ పార్టీలో నిబద్ధత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తనని చెప్పారు. కేసీఆర్‌ పార్టీ అధ్యక్షులే కాదు.. తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులని మాట్లాడారు.

ఇలా హరీష్ స్టేట్‌మెంట్ ఇచ్చినా సరే ఈటల మరొకసారి హరీష్‌ని టార్గెట్ చేశారు. తనకు కలిగిన బాధే మంత్రి హరీశ్‌ రావుకూ కలుగుతుందని అన్నారు. అంటే ఈటల మాదిరిగానే హరీష్ టీఆర్ఎస్ నుంచి అవమానంతో బయటకొస్తారా అని చెబుతున్నట్లు ఉంది. మరి హరీష్‌ని టార్గెట్ చేయడం వల్ల టీఆర్ఎస్‌లో నిజమైన తెలంగాణవాదులకు స్థానం లేదని ఈటల చెబుతున్నారని, దాని ద్వారా హుజూరాబాద్‌లో ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version