160 స్థానాల్లో ఒంట‌రిగా పోటీ చేసి గెలిస్తే.. రాజకీయాల నుంచి త‌ప్పుకుంటా : కొడాలి నాని

-

జ‌న‌సేన ఆవిర్భవ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెద్ద దూమారమే లేస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌టికే అధికార వైసీపీ పార్టీకి చెందిన ప‌లువురు నేతలు కౌంట‌ర్ ఇచ్చారు. తాజా గా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని కూడా స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. చంద్ర‌బాబును ముఖ్య మంత్రిని చేయాల‌ని క‌ష్టప‌డుతున్నాడ‌ని అన్నారు. ఇత‌ర పార్టీలో ఉండి చంద్ర బాబు కోసం ప‌ని చేయ‌డం కంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. టీడీపీలో చేరాల‌ని విమ‌ర్శించారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ లో వైఎస్ జ‌గ‌న్ ఢీ కొట్టే మ‌గాడే లేడ‌ని అన్నారు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 160 అసెంబ్లీ స్థానాల్లో ఒంట‌రగా పోటీ చేసే స‌త్త ఏ పార్టీకి లేద‌ని అన్నారు. ఒక వేళా.. ఏ పార్టీ అయినా.. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 160 అసెంబ్లీ స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసి గెలిస్తే.. రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించారు.

ఆంద్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేసి గెలిచే ద‌మ్ము, స‌త్తా వైఎస్ జ‌గ‌న్ కు మాత్ర‌మే ఉంద‌ని అన్నారు. అలాగే వైఎస్ జ‌గ‌న్ ఉన్నంత వ‌ర‌కూ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి సీఎం ఆయ‌న అని అన్నారు. ఆయ‌న‌ను ట‌చ్ చేసేవారే ఉండ‌రని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version