IPL 2022 : ఐపీఎల్‌లోకి షేన్ వాట్స‌న్ రీ ఎంట్రీ .. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ప్ర‌క‌ట‌న‌

-

ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు, స్టార్ ఆలౌ రౌండ‌ర్ షేన్ వాట్స‌న్ ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గ‌తంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడిన షేన్ వాట్స‌న్.. చెన్నై క‌ప్ గెలిచినా ప్ర‌తి సారి అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న చేసేవాడు. అయితే షేన్ వాట్స‌న్ అన్ని ఫార్మెట్ల నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నాడు. దీంతో గ‌త ఏడాది ఐపీఎల్ లో కూడా ఆడ‌లేదు. అయితే తాజా గా ఐపీఎల్ 2022 లో షేన్ వాట్స‌న్ రీ ఎంట్రి ఇచ్చాడు.

అయితే ఈ సారి ఆట‌గాడిగా కాకుండా.. కోచ్ అవ‌తారం ఎత్త‌నున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది. త‌మ జ‌ట్టుకు అసిస్టెంట్ కోచ్ గా ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కోచ్ బృందం బ‌లంగా ఉంది. ఇప్ప‌టికే హెడ్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఉన్నాడు. అలాగే అసిస్టెంట్ కోచ్ గా.. ప్ర‌వీణ్ ఆమ్రే, అజిత్ అగార్క‌ర్, జెమ్స్ హోప్స్ ఉన్నారు.

ప్ర‌స్తుతం షేన్ వాట్స‌న్ కూడా కోచ్ బృందంలోకి చేరాడు. కాగ అసిస్టెంట్ కోచ్ గా నియ‌మిస్తు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్ర‌క‌టించ‌గానే… షేన్ వాట్స‌న్ స్పందించాడు. గ్రెట్ రిక్కి పాంటింగ్ నాయ‌క‌త్వం లో ప‌ని చేయ‌డానికి ఆశాతో ఎదురు చూస్తున్నాన‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version