ఒకపక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సరే అధికార పార్టీ నేతల తీరు మాత్రం ఏ మాత్రం కూడా మారడం లేదు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని చెబుతున్న పోలీసులు కూడా వైసిపి నేతలను కట్టడి చేయడంలో తీవ్రంగా విఫలమవుతున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు చాలా వరకు క్రమశిక్షణతో లాక్ డౌన్ పాటిస్తున్నా అధికార వైసీపీ నేతలు మాత్రం తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
తాజాగా సీఎం వైయస్ జగన్ బాబాయి అలాగే టీటీడీ చైర్మన్ గా ఉన్న వై వి సుబ్బారెడ్డి పుట్టిన రోజు వేడుకలకు గాను తిరుమల వెళ్లి మూసి ఉన్న శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి వై.వి.సుబ్బారెడ్డి కొన్ని ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ వేళ తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈనెల 31 వరకు మూసి వేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే .
మరి ఈ తరుణంలో వై.వి.సుబ్బారెడ్డి ఏ విధంగా వెళ్లి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడానికి గుడి తలుపులు తెరిచారు..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మాజీమంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం లేనప్పుడు ఏ విధంగా పుట్టినరోజు వేడుకలను గుడి తలుపులు తెరిచి జరుపుకుంటారు అంటూ మీ గుడిని మీరే కాపాడుకోవాలని ట్వీట్ చేసారు.
” దేవదేవుడు ఉత్సవాలతో అలరారిన తిరుమలగిరులు నిర్మానుష్యంగా మారినవేళ నిబంధనలు తుంగలోతొక్కి నీ సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు.. నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ! ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శనభాగ్యమే లేదు. వైఎస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా!” అని ట్వీట్ చేసారు.
ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శనభాగ్యమే లేదు. వైఎస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా! (1/2) pic.twitter.com/y5WhI47l1r
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 2, 2020
దేవదేవుడు ఉత్సవాలతో అలరారిన తిరుమలగిరులు నిర్మానుష్యంగా మారినవేళ నిబంధనలు తుంగలోతొక్కి నీ సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు.. నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ! (2/2) pic.twitter.com/Dq202dIm8x
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 2, 2020