వైసీపీ తగ్గట్లేదు..ఇంకా టీడీపీ-జనసేన సర్దుకోవచ్చు.!

-

ఏపీలో అధికార వైసీపీ హవా కొనసాగుతూనే ఉంది. ఏ సర్వే అయినా..ఏ ఎన్నికలైన వైసీపీదే డామినేషన్..2019 ఎన్నికల నుంచి ఇప్పటివరకు వైసీపీ డామినేషన్ కొనసాగుతూనే ఉంది. పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, ఉపఎన్నికలు..ఇలా ఏదైనా సరే వైసీపీ వన్ సైడ్ గా గెలుస్తుంది. అయితే ఇంకా 10 నెలల్లో సాధారణ ఎన్నికలు వస్తాయి. సాధారణంగా నాలుగు ఏళ్ళు పాలనలో ఉన్న పార్టీపై వ్యతిరేకత వస్తుంది. కానీ వైసీపీకి అలా లేదు.

ఇప్పటికీ ప్రజలు వైసీపీకే మద్ధతు ఇస్తున్నారు. తాజాగా పంచాయితీ ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికల్లో కూడా వైసీపీ హవా నడిచింది. ఉప ఎన్నికలు జరగాల్సిన మొత్తం 66 పంచాయతీల్లో ముందే 31 సీట్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 1064 గ్రామ వార్డులకు గాను 819 స్థానాలను కూడా ఏకగీవ్రం చేసుకుంది. దీంతో.. 35 పంచాయతీలు, 245 గ్రామ వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో వైసీపీ మద్దతుదారులు 22 చోట్ల నెగ్గారు. టీడీపీ 9 చోట్ల, టి‌డి‌పి-జనసేన కలిసి రెండు చోట్ల గెలిచారు.

2 చోట్ల ఇతరులు గెలిచారు. ఇక 245 వార్డుల్లో 130 వార్డుల్లో అధికార వైసీపీ మద్దతుదారులు గెలవగా, 94 చోట్ల టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. మిగతా వార్డుల్లో ఇతరులు గెలిచారు.

మొత్తానికి పంచాయితీ ఉపఎన్నికల్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపించింది. అయితే గతంలో పోలిస్తే టి‌డి‌పి స్వల్పంగా పుంజుకున్నట్లు కనిపించింది..కానీ ఎక్కడా కూడా వైసీపీకి పెద్దగా పోటీ ఇవ్వలేదు. ఇక ఇటీవల ఏ సర్వేలో చూసిన వైసీపీ హవా కనబడిన విషయం తెలిసిందే. దీంతో రానున్న ఎన్నికల్లో వైసీపీ హవా ఖాయం..టి‌డి‌పి-జనసేన కలిసిన సరే వైసీపీ జోరు కొనసాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version