చంద్రబాబుకు వైసీపీ హైప్ ఇస్తుందా? అసలు దారుణమైన ఓటమిని చవిచూసిన బాబుని వైసీపీనే పైకి లేపుతుందా? అంటే గత నాలుగేళ్లుగా వైసీపీ రాజకీయం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. వైసీపీ అధికార బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి..టిడిపిని అణిచి వేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడా కూడా టిడిపికి ఆ పరిస్తితి రావడం లేదు. ఎక్కడకక్కడ టీడీపీ బలపడుతుందే తప్ప..బలహీన పడుతున్నట్లు కనిపించడం లేదు.
వైసీపీ చేస్తున్న రాజకీయమే టిడిపికి అడ్వాంటేజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఎక్కడకక్కడ టిడిపి నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడం, వారిని రాజకీయంగా దెబ్బకొట్టాలనే ప్లాన్ చేయడమే రివర్స్ అవుతున్నాయి. ఇక కొందరు వైసీపీ నేతలు చంద్రబాబుని బూతులు తిట్టి..ఆయనపై జనాల్లో సానుభూతి పెరిగేలా చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్లే నాలుగేళ్లలో వైసీపీకి ధీటుగా టిడిపి బలపడింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. టిడిపి వీక్ గా ఉందని చెప్పడానికి లేకుండా పోయింది. అంటే బాబుపై ఎంత ఎటాక్ చేస్తే..అంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు.
పైగా ఆయన ప్రజల్లోకి వెళుతుంటే..ప్రజా మద్ధతు బాగా వస్తుంది. ఇటు నారా లోకేష్ పాదయాత్ర కూడా టిడిపికి కలిసొస్తుంది. మొన్నటివరకు లోకేష్‌ని పప్పు అని ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆ లోకేశ్ తోనే వైసీపీకి రిస్క్ పెరిగేలా ఉంది. అంటే వైసీపీ చేసిన పనులే ఆ పార్టీకి రివర్స్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు చంద్రబాబుని జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు సవాళ్ళు చేస్తున్నారు.
గత టిడిపి హయాంలో అమరావతిలో భూముల అక్రమాలు జరిగాయని, దీనిపై సిట్ తో విచారణకు సుప్రీం కోర్టు లైన్ క్లియర్ చేసిందని, దీంతో బాబు అరెస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక ఇలాగే కేసులు, జైలు అని అనడం వల్ల..అదంతా రాజకీయ కక్ష గానే ప్రజలు చూస్తున్నారు. దీని వల్ల బాబుపైనే సానుభూతి పెరుగుతుంది. అంటే వైసీపీ నేతలే బాబుకు హైప్ ఇస్తున్నారు..టిడిపిని బలోపేతం చేస్తున్నారు.