‘సిటీ’ల్లో ‘ఫ్యాన్’ జోరు..ఆ సీట్లలో ఆధిక్యం.!

-

ఏపీలో అధికార వైసీపీకి రూరల్ ఏరియాల్లోనే బాగా పట్టు ఉంది..సిటీలో పెద్దగా పట్టు లేదని చెప్పి ఎప్పుడు విశ్లేషణలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ అదే రకమైన విశ్లేషణలు వస్తున్నాయి. కానీ గతంలో పరిస్తితులు వేరు..ఇప్పుడు పరిస్తితులు వేరు..సిటీల్లో కూడా వైసీపీకి పట్టు పెరిగింది. గత ఎన్నికల్లో రూరల్ తో పాటు సిటీల్లో కూడా వైసీపీ చాటింది. ఈ సారి అదే దూకుడుతో ముందుకెళుతుందని తెలుస్తోంది.

సిటీల్లో వైసీపీ హవా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. రూరల్ లో ఆధిక్యం వైసీపీకే ఉంది. కాకపోతే సిటీల్లో కాస్త టి‌డి‌పితో గట్టి పోటీ ఎదురుకోవాల్సి ఉంటుంది. అయినా సరే ఆధిక్యం దిశగానే ముందుకెళుతుంది. సిటీలోని పేద, మధ్యతరగతి ప్రజలకు పథకాలు, ఇళ్ల స్థలాలు, అటు వాలంటీర్, సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద ప్లస్ అవుతుంది.  ఈ క్రమంలో ఏపీలో ఉన్న పట్టణాల్లో పరిస్తితులు చూసుకుంటే..శ్రీకాకుళం టౌన్ నియోజకవర్గంలో వైసీపీకి ఆధిక్యం ఉంది.

విజయనగరంలో కాస్త టి‌డి‌పితో పోటీ ఉంది. విశాఖలో కూడా పోటీ ఉంది. కాకపోతే గత ఎన్నికల్లో విశాఖ సిటీలో నాలుగు స్థానాలు టి‌డి‌పి గెలుచుకుంది. ఇప్పుడు వైసీపీ 2 సీట్లలో లీడ్ ఉంది. కాకినాడ సిటీలో వైసీపీ హవా ఉంది. కాకపోతే ఇక్కడ టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి ఇబ్బంది.

రాజమండ్రి సిటీలో టి‌డి‌పికి ఆధిక్యం ఉంది. ఏలూరులో వైసీపీకి లీడ్ ఉంది..కానీ టి‌డి‌పి-జనసేన పొత్తు ప్రభావం ఉంది. విజయవాడ నగరంలో మూడు సీట్లు ఉంటే వైసీపీకి 2 సీట్లలో లీడ్ ఉంది. గుంటూరు సిటీలో ఒక సీటులో టి‌డి‌పి, ఒక సీటులో వైసీపీకి లీడ్ ఉంది. ఒంగోలులో వైసీపీకి లీడ్. నెల్లూరు సిటీలో టి‌డి‌పితో పోటీ ఉంది. ఇక తిరుపతి, అనంత సిటీ, కర్నూలు సిటీ, కడప సిటీల్లో వైసీపీకి ఆధిక్యం ఉంది. ఓవరాల్ గా సిటీ సీట్లలో కూడా వైసీపీ ఆధిక్యంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version