మన్యం గడ్డ..వైసీపీ అడ్డా..మళ్ళీ స్వీపే.!

-

మన్యం గడ్డ..వైసీపీ అడ్డా..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. గిరిజన జిల్లాగా ఉన్న మన్యం వైసీపీ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో మన్యంలో వైసీపీదే హవా..ఈ సారి ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీ హవానే ఉండనుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పవచ్చు. అరకు పార్లమెంట్ పరిధిలో ఉండే ఈ మన్యం జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా. ఈ జిల్లా పరిధిలో నాలుగు స్థానాలు ఉన్నాయి. పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఉన్నాయి.

ఇందులో పార్వతీపురం ఎస్సీ స్థానం..మిగిలిన మూడు స్థానాలు ఎస్టీ స్థానాలు. ఇక మొదట నుంచి ఈ నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్నాయి. ఇక తర్వాత వైఎస్సార్ పై అభిమానంతో వైసీపీ కంచుకోటలుగా మారిపోయాయి. 2014 ఎన్నికల్లో పార్వతీపురంలో టి‌డి‌పి గెలవగా, మిగిలిన మూడు స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నాలుగు స్థానాల్లో గెలిచేసింది.

 

అయితే ఈ సారి ఎన్నికల్లో నాలుగు స్థానాలని మళ్ళీ గెలుచుకునే దిశగానే వైసీపీ వెళుతుంది. కాకపోతే ఈ సారి టి‌డి‌పి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత దీనికి కారణం. ముఖ్యంగా పార్వతీపురం, కురుపాం స్థానాలే డౌట్. ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ప్రజలు జగన్ వైపే ఉన్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే ఎమ్మెల్యేలకు ప్లస్. ఇక ప్రజలు ఎమ్మెల్యేలని కాకుండా జగన్ ని చూసి ఓటు వేస్తే మళ్ళీ వైసీపీ సులువుగా గెలిచేస్తుంది.

ఇక సాలూరు, పాలకొండ స్థానాల్లో ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గానే ఉన్నారు. అక్కడ వైసీపీ విజయాలకు ఎలాంటి ఢోకా లేదు. మొత్తం మీద చూసుకుంటే మన్యం మళ్ళీ వైసీపీ వశమయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version