ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరువుని ఆయన పార్టీ ఎమ్మెల్యేలే తీస్తున్నారని అంటున్నారు ఆయన పార్టీ కార్యకర్తలు. రాజకీయంగా బలంగా ఉన్నామనే కారణంతో ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఇప్పుడు జగన్ కి కూడా ఇబ్బందిగా మారింది. నెల రోజుల క్రితం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేసారు.
మీడియా రాయలేని భాషలో ఆయన మాట్లాడారు. ఇక తాజాగా తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ కూడా చంద్రబాబుపై తన నోటి దురుసు చూపించారు. నోటికి ఏది వస్తే రాయలేని భాషలో దూషించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఎదగాలి అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని, ప్రజాజీవితంలో ఉన్న వాళ్ళు నోరు అదుపు చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఇక ఈ వ్యవహారం జగన్ మెడకు చుట్టుకుంటుంది. ఆయన సహకారం లేదా ఆదేశాలతోనే ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని వాళ్లకు అసలు కనీస గౌరవం ఇతరుల మీద లేదని అంటున్నారు పలువురు. ఇలా చేస్తే జగన్ రాజకీయ జీవితం కూడా ఇబ్బంది పడుతుందని తమ కోప తాపాలు, తమ భావోద్వేగాలు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని లేకపోతే జగన్ చులకన అయిపోతారని అంటున్నారు.