జగన్ ప్రభుత్వంపై ఎవరు యాంటీగా మాట్లాడిన లేదా విమర్శలు చేసిన వారిపై వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం సహజమే. ఒకప్పుడు రాజకీయ పరమైన కౌంటర్లు ఉండేవి. ఇప్పుడు ఆ స్థాయి దాటేసింది. జగన్‌ని విమర్శించిన ఎవరైనా సరే వైసీపీ నేతలు ఊరుకోరు..వెంటనే వారిపై విరుచుకుపడతారు. అలాగే విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ చంద్రబాబుతో లింక్ చేస్తారు. బాబు డైరక్షన్ లోనే వారంతా పనిచేస్తున్నారని అంటారు.
ఇప్పటికే ఏపీలో కమ్యూనిస్టులు..జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే..వారు బాబు తోకలు అంటారు. ఇక పవన్‌ని ఎలాగో దత్తపుత్రుడు అని అంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ బిజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి, అప్పులపై విమర్శిస్తున్నారు. అయితే ఇది కేవలం ఆమె వర్షన్ మాత్రమే. కానీ పురందేశ్వరి..చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని..వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పైగా మరిది కోసం వదిన రాజకీయం నడిపిస్తున్నారని, టిడిపిని గెలిపించడానికి పురందేశ్వరి తనవంతు పాత్ర పోషిస్తున్నారని చెప్పుకొస్తున్నారు.
అయితే ఇలా వైసీపీ ప్రతి ఒక్కరినీ చంద్రబాబుకు అంటగట్టి విమర్శలు చేయడం వెనుక ఒక స్కెచ్ ఉంటుంది. అంటే వారు ఏ అంశంపై విమర్శలు చేస్తున్నారో..ఆ టాపిక్ డైవర్ట్ చేస్తారు..కేవలం వారు బాబు చెప్పినట్లే చేస్తున్నారని ప్రజల్లోకి వెళ్ళేలా చేస్తారు. ఇప్పుడు పురందేశ్వరిని కూడా అలా టార్గెట్ చేయడానికి కారణం..బిజేపి-టిడిపి కలుస్తున్నాయనే నేపథ్యంతో మాట్లాడుతున్నారు.
ఎలాగో బిజేపిపై యాంటీ ఉంది. దాంతో బాబుతో కలపడం వల్ల..ఆ బిజేపిపై ఉన్న యాంటీ టిడిపికి రావాలనేది వైసీపీ కాన్సెప్ట్. అలాగే తాము అంతా మంచి చేస్తుంటే చంద్రబాబు కుట్రలు చేసి ఇదంతా చేయిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ ఎవరినైనా టార్గెట్ చేసిదంటే..దాని వెనుక రాజకీయం చాలానే ఉంటుంది.