ప్రస్తుతం అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఈ మధ్యనే ఒడిశాలో ఈ టెక్నాలజీని ఉపయోగించి వార్తలు చదివించే కృత్రిమ యాంకర్‌ను తయారుచేశారు. టీవీ జర్నలిజంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐ న్యూస్ యాంకర్‌ను పరిచయం చేశారు. కన్నడా, నొయిడా, పంజాబ్, చైనాలో కూడా కృత్రిమ న్యూస్ యాంకర్స్‌ను జర్నలిజంలో తీసుకొచ్చారు. మన తెలుగు నెట్‌వర్క్‌లో మొట్టమొదటి ఏఐ న్యూస్ యాంకర్‌ను ఏబీపీ దేశం తీసుకురావడం విశేషం. ఇండియాలోని ప్రముఖ న్యూస్ సంస్థల్లో ఒకటైన ABP Network తమ తొలి అర్టిఫిషియల్ యాంకర్ ‘ఐరా (AIRA)’ ను ప్రవేశపెట్టింది. నెట్‌వర్క్‌లోని తెలుగు డిజిటల్ ఛానల్ ABP Desam రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆ ప్లాట్‌ఫామ్‌పై ఐరాను పరిచయం చేశారు.
AIRA సాంప్రదాయ, ఆధునికతల కలబోత అని, విజ్ఞానానికి ,నైపుణ్యానికి ప్రతీక అని ABP Network CEO అవినాష్ పాండే పేర్కొన్నారు.ఇక నుంచి ABP Desam ద్వారా వినూత్నమైన వార్తాంశాలను నిత్య నూతనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. తెలుగు రీడర్స్‌కి దగ్గరవ్వాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ABP Desam న్యూస్ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించి, ఇప్పుడు తెలుగు వీక్షకుల కోసం AIRA ను కూడా తీసుకొస్తున్నట్లు పాండే తెలిపారు. ABP Desam వెబ్‌సైట్, యాప్‌తో పాటు అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
ABP Desam ప్రయాణం మొదలై కేవలం రెండేళ్లలోనే YouTubeలోనే 58 కోట్ల ఇంప్రెషన్స్ సాధించింది. తెలుగు న్యూస్ పబ్లిషర్స్‌లో అత్యంత వేగంగా దూసుకు పోతున్న ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచింది. సోషల్ మీడియాలోనూ ఇదే స్థాయిలో అందరికీ చేరువవుతోంది. లాంఛ్ అయినప్పటి నుంచి Facebookలో 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఈ రెండేళ్లలో వెబ్‌సైట్‌లో లక్షకుపైగా స్టోరీస్‌ని పబ్లిష్ చేసిన ఘనత ABP Desam దే. గూగుల్ సెర్స్, డిస్కవర్ సోర్సెస్‌లో 100 కోట్ల ఇంప్రెషన్స్ సాధించింది. అతి తక్కువ సమయంలోనే Comscore Rankingలో టాప్ 5లో చోటు దక్కించుకుంది ABP Desam. తెలుగులో ఏఐ యాంకర్‌ను ఓ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యనే ప్రవేశపెట్టినప్పటికీ.. పెద్ద ఫ్లాట్‌ఫామ్‌పై తెలుగు మీడియాలో ఏఐ న్యూస్ యాంకర్‌ను తీసుకొచ్చిన మొదటి నెటవర్క్ ఛానల్‌గా ఏబీపీ దేశం నిలిచింది. 100 ఏళ్ల క్రితం ప్రారంభమైన ABP Group తొలితరం మీడియా సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ABP దేశం రెండో వార్షికోత్సవం సందర్భంగా AIRAని లాంఛ్ చేస్తూ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ నూతన ట్రెండ్‌ను రానున్న రోజుల్లో మరిన్ని ఛానల్స్ అందిపుచ్చుకునే అవకాశం ఉందని మీడియా నిపుణులు అంటున్నారు.