ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడిపోతుంది. ఈ క్రమంలో భారతదేశం కూడా రోజు రోజుకీ పెరుగుతున్న కేసులతో ఇబ్బందిపడుతుంది. దీంతో దేశంపై పడే ఆర్ధిక భారం.. ముందు ముందు తీవ్రంగా ఉండే పరిస్థితి! ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో… మిగిలిన విషయాలపై కూడా అదేస్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగా… ఇటు కరోనాపై ఎంత శ్రద్ధపెట్టి పనిచేస్తున్నారో… కోతల సమయం కావడంతో రైతులు నష్టపోకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు!
ఎన్ని విమర్శలు వస్తున్నా… రాష్ట్రపతి పాలన వచ్చేలా ఉందని వడ్డే శోభనాదీశ్వర రావు వంటి వారు ఆశిస్తున్నా… అమెరికాలా అయిపోతుందేమో అని బోండా ఉమలాంటి వారు శాపనార్ధాలు పెడుతున్నా… దీక్షల పేరు చెప్పి, పసలేని విమర్శలు చేస్తూ టీడీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నా… తనపని తాను చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! ఇందులో భాగంగా… ఏపీలో చేపల కు పెద్ద మార్కెట్ అయిన అసోం ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడిపెట్టారు జగన్. ఏపీలో ఆక్వా ఉత్పత్తులను అధికంగా దిగుమతి చేసుకునే అస్సోం ఈ విషయంపై పాజిటివ్ గా స్పందించింది. ఇదే క్రమంలో మరిన్ని ఆలోచనలు చేస్తున్నారు జగన్!
గత రెండు రోజుల క్రితం పొట్టకూటి కోసం వలస వెళ్లి గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఆదుకోవాని, వారికి వసతి, భోజన సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడిన సంగతి తెలిసిందే. అనంతరం తాజాగా గుజరాత్ లో ఉన్న 5000మంది మత్స్యకారులను ప్రత్యేక బోటు ఏర్పాటుచేసి సముద్ర మార్గం ద్వారా ఏపీకి తరలించాలని సీఎం నిర్ణయించి ఈ మేరకు గుజరాత్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో… ఏపీ మామిడి రైతులను ఆదుకునే కార్యక్రమానికి పూనుకున్న ఏపీ సర్కార్… ఇప్పటికే రాష్ట్రంలో మామిడి ఎగుమతులకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు… ఇప్పటికే విదేశాలకు ఎగుమతులను ప్రారంభించింది. ఈ రకంగా కరోనాపై ఎంత శ్రద్ధపెట్టి పనిచేస్తున్నారో.. రైతులను ఆదుకోవడంలో కూడా అదే శ్రద్ధ చూపిస్తున్నారని పలువురు అభినందిస్తున్నారు!