విద్యారంగానికి జగన్ ‘జాక్-పాట్’..!

-

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఎన్నికల మునుపు వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను చదువుల బడిగా మరుస్తానని హామీ ఇచ్చారు. తాను పాద యాత్ర చేస్తున్న సమయంలో నేను విన్నాను నేను ఉన్నాను అంటూ గ్రామ వీధుల్లో ప్రచారం చేసుకున్నారు. ఇక జగన్ ఇచ్చిన మాట ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ను చదువుల బడిగా తీర్చిదిద్దెందుకు 2020-21 బడ్జెట్ లో విద్యారంగానికి పెద్ద పీఠ వేశారు. ‘మన బడి నాడు-నేడు’  పథకాన్ని అమలు పరచడానికి దాదాపుగా 3000 కోట్ల రూపాయాలని విద్యారంగానికి కేటాయించింది.

ప్రభుత్వ పాఠశాలల లోని వసతులను కార్పొరేట్ పాఠశాలల స్థాయికి చేర్చాలని జ్యేయంగా పెట్టుకున్న సిఎం జగన్ అందుకుగాను 15715 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశాడు. ఆ పాఠశాలల్లో వసతుల సదుపాయం కొరకు మరియు విద్యార్థులకు వసతులు కల్పించేద్నుకు 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫామ్‌లు, నోటు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు,బెల్టు స్కూల్‌ బ్యాగ్‌ మొత్తం స్టూడెంట్‌ కిట్‌గా ’ జగనన్న విద్యాకానుక’  పేరిట అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు మధ్యాహ్న భోజనం వండి పెట్టే వంట మనుషులకు ఇచ్చే నెలవారీ పారితోషికాన్ని రూ.1000 నుంచి రూ.3000కు ప్రభుత్వం పెంచింది. ఇక సెకండరీ విద్యాశాఖల అభివృద్ధి కొరకు 22604 కొత్ల్;ఊ కేటాయించింది. ఉన్నత విద్యారంగాన్ని ఇంజనీరింగ్ కాలేజీలలోని వస్తులను పెంచేందుకు ఆ రంగాన్ని మెరుగు పరిచేందుకు 2277 కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version