ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ అంతా కంట్రోల్ లో ఉందని మొన్నటి వరకు ప్రభుత్వ పని తీరుపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా పాజిటివ్ ఒక్కసారిగా బయట పడటంతో ఏపీ సర్కార్ డైలమాలో పడింది. మొన్నటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతుండగా ఏపీలో మాత్రం పెద్దగా ఏమీ బయటపడలేదు. అయితే ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా కి వెళ్ళిన వారు ఏపీ నుండి కూడా ఉండటంతో వారిలోనే ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు బయట పడటంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది.
మేటర్ ఏమిటంటే ఇవాళ నుండి ఏపీ ప్రభుత్వం ఇంటికే నిత్య అవసరాల వస్తువులు కూరగాయలు పంపిణీ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. నిజాముద్దీన్ దర్గా వెళ్లిన వారికి ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో…మత ప్రార్థనలకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించి…ఇక నుండి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలని…వైయస్ జగన్ సర్కార్ డిసైడ్ అయిందట.