డేటా చోరీ చేసి చంద్రబాబు అడ్డంగా బుకాయిస్తున్నారు: వైఎస్ జగన్

-

ఏపీని దొంగ, నేరగాడు, రాక్షసుడు పాలిస్తున్నారు. చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. అడ్డంగా దొరికిపోయి దొంగ దొంగ అంటూ తన నేరాన్ని పక్కవాళ్లపై రుద్దుతున్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తన బినామీ కంపెనీలకు అప్పనంగా ఇచ్చి.. వైసీపీ ఓట్లను తొలగించే కార్యక్రమానికి తెర లేపారు.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

నెల్లూరులో జరిగిన వైసీపీ సమరశంఖారావం సభలో పాల్గొన్న జగన్.. ఈసందర్భంగా ఏపీ డేటా చోరీపై మాట్లాడారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకే అధికారిక వైబ్ సైట్ల నుంచి ఏపీ ప్రజల డేటాను దొంగలించి ఐటీ గ్రిడ్స్ కంపెనీకి కట్టబెట్టి.. తన సొంత యాప్ సేవా మిత్రలోకి అప్ లోడ్ చేయించుకున్నారని ఆరోపించారు.

చివరకు తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటును కూడా తొలగించారని జగన్ ఆరోపించారు. డేటాను ప్రైవేటు కంపెనీకి అప్పగించి… అడ్డంగా బుక్కయి.. ఇప్పుడు బుకాయిస్తున్నారని విమర్శించారు. అసలు.. ఐటీ గ్రిడ్స్ కంపెనీకి, లోకేశ్ కు, చంద్రబాబుకు ఉన్న సంబంధమేందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల డేటాను దొంగతన చేయడం నేరం కాదా అని జగన్ ప్రశ్నించారు.

తెలంగాణ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఆ కంపెనీలో సోదాలు చేస్తే వెంటనే ఏపీ పోలీసులను చంద్రబాబు ఉసిగొల్పారని.. ఏపీ పోలీసులను తన వాచ్ మెన్లుగా చంద్రబాబు వాడుకుంటున్నారని.. ఇది అధికార దుర్వినియోగమేనని.. దీనిపై ప్రశ్నిస్తే.. హైదరాబాద్ ను నేనే కట్టా.. సెల్ ఫోన్ నేనే కనిపెట్టా… సైబరాబాద్ ను నేనే కట్టా.. అంటూ సొల్లు కబుర్లు చెబుతున్నారంటూ మండిపడ్డారు.

అడ్డంగా ఏపీ ప్రజల డేటాను దొంగలించి.. పట్టుబడి ప్రజలకు క్షమాపణ చెప్పకుండా.. వైసీపీ మీద బురద జల్లుతున్న చంద్రబాబు మనస్తత్వాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని జగన్ పేర్కొన్నారు. టీడీపీకి ఓటేయని వాళ్ల ఓట్లను తొలగిస్తున్నారని… చివరకు వాళ్లకు పెన్షన్లు, పథకాలను నిలిపి వేస్తున్నారని జగన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version