విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి దూకుడు మీద ఉంది.. విజయనగరం లోకల్ వార్ లో కూడా గెలిచి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది.. సంఖ్యా బలం పరంగా వైసీపీకి ఎక్కువమంది ప్రజా ప్రతినిధులు ఉండడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా పక్కా ప్లాన్ తో ముందుకెళ్తుంది.. కూటమి పార్టీలు అభ్యర్థి ఎంపిక గురించి సమీక్షలు నిర్వహించక ముందే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి తగ్గేదెలా అన్నట్లు వ్యవహరిస్తుంది..
విజయనగరం స్థానిక సంస్థల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్న అప్పలనాయుడుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు.. పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన.. వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని ఆయన పేరును ఖరారు చేశారు.. విజయనగరం జిల్లాలో సీనియర్ నాయకుడిగా, అందరితో సన్నిహితంగా ఉండే అప్పలనాయుడుని.. బొత్స సత్యనారాయణ ప్రతిపాదించారట.. అన్ని సమీకరణాలను పరిశీలించిన వైసీపీ అధినేత జగన్.. గెలుపు బాధ్యతలను కూడా బొత్స మీదే ఉంచినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌నేత బొత్సకు అవకాశం ఇచ్చిన దృష్ట్యా, ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు పేరును పార్టీ ప్రకటించినట్లు తెలుస్తోంది..
ఉత్తరాంధ్రను ఊపేసే ఎన్నిక కావడంతో రెండు పార్టీలు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి..పట్టు నిలుపుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే.. అధికారంలో ఉన్న కూటమి సైతం బరిలోకి దిగేందుకు సిద్దమౌతుంది..సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో కూటమి పార్టీలు ఈ ఎన్నికపై ఆలోచనలో ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.. 2021 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున రఘురాజు గెలుపొందారు.. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన సతీమణి తెలుగుదేశం పార్టీలో చేరడంతో.. ఆయనపై వైసీపీ అర్హత వేటుకి ప్రతిపాదించింది.. విజయనగరం జిల్లాలో మొత్తం 753 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.. అందులో వైసిపికి 548 మంది ఉండగా.. టిడిపికి 150 మంది, జనసేనకు 13, స్వతంత్ర ఓటర్లు మరో 13 మంది ఉన్నారు.. ఈ రకంగా చూసుకుంటే వైసీపీకే బలం ఎక్కువ..
గెలుస్తామనే కాన్ఫిడెంట్ తో వైసీపీ తమ అభ్యర్థిని ముందుగానే ప్రకటించేది.. దాంతోపాటు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు అవుతుంది.. ఎవరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కూడా గెలిచి సత్తా చాటాలని వైసిపి గట్టిగా భావిస్తుంది.. గెలుపు బాధ్యతలని వైసీపీ అధినేత జగన్.. బొత్స సత్యనారాయణ కి అప్పగించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది.. జగన్ డైరెక్షన్లో బొత్సతో పాటు కీలక నేతలు పనిచేస్తున్నారట.. మొత్తంగా మరోసారి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది..