కులగణనకు మీరెక్కడున్నా సరే.. ఆధార్,రేషన్ కార్డు దగ్గరపెట్టుకోండి

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి స్టిక్కరింగ్ ప్రాసెస్ పూర్తి చేసినట్లు సమాచారం. వారు వచ్చినప్పుడు ఎవరైనా ఇంట్లో లేకపోతే, ఉద్యోగాల కోసం ఇతర సిటీలకు వెళ్లినవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇతర కారణాల వలన మీరు పాత అడ్రసులో అందుబాటులో లేకపోతే మీ ఆధార్, రేషన్ కార్డు దగ్గర పెట్టుకోవాలని సూచించింది.

మీరు ఎక్కడ ఉన్నారనేదానితో సంబంధం లేకుండా ఎన్యూమరేటర్లు వివరాలు సేకరిస్తానని పేర్కొంది. ఆధార్ అడ్రసుతో సంబంధం లేదని వెల్లడించింది. అయితే, సిబ్బంది వచ్చినపుడు ఆధార్, రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version