శ్రీకాకుళం ఎంపీ స్థానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురి.. తెరపైకి కొత్త ఈక్వేషన్..

-

శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయకుండా చాప కింద నీరులా తమ ఆలోచనలకు పదును పెడుతోంది.. టిడిపి పైకి కొత్త ఆస్త్రాన్ని సరికొత్తగా ప్రయోగించబోతోంది. ఈ పార్లమెంట్ సిగ్నట్ ను తెలుగుదేశం పార్టీ వరుసగా కైవసం చేసుకుంటుంది. దీంతో పార్టీకి ఇది కొరకరాని కొయ్యగా మారింది.

తీవ్రమైన కసరత్తు.. లెక్కలు సమీకరణాలు.. బెరీజులు వేసుకున్న వైసీపీ అధిష్టానం ఈ నియోజకవర్గం నుంచి బలమైన నేతను బరిలోకి దింపాలని భావించిందట. దీంతో సామాజిక వర్గం కోణంలో ఆలోచించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాలింగ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న తిలక్ పేరును ఫైనల్ చేశారట. జిల్లాలో వెలమ వర్సెస్ కాలింగ కులాల మధ్య మొదటినుంచి ఆదిపత్య పోరు నడుస్తోంది. దాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు వైసిపి వ్యూహాత్మకంగా పావులు కలిపిందని పార్టీలో చర్చ నడుస్తుంది.

వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు ను దీటుగా ఎదుర్కోవాలంటే పేరాడ తిలక్ మాత్రమే కరెక్ట్ అని వైసీపీ భావించిందట. తిలక్ కి తన సామాజిక వర్గంలో మంచి పేరు ఉందని.. దాన్ని క్యాష్ చేసుకుంటే కాలింగ ఓట్లన్నీ సాలిడ్ గా తమ పార్టీకే పడతాయని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. వైసీపీలో ప్రస్తుతం ఉన్న వర్గపోరుని తిలక్ అయితేనే హ్యాండిల్ చేస్తారని భావించిన వైసీపీ.. ఆయన్ని బరిలోకి దింపిందని సెగ్మెంట్లో టాక్ నడుస్తోంది.. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి…

Read more RELATED
Recommended to you

Exit mobile version