నరసరావుపేటలో ఆట మొదలుపెట్టిన అనిల్..

-

తన మాటల దూకుడుతో ప్రత్యర్థులకు దడ పుట్టించే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు వైసీపీ అధిష్టానం ప్రమోషన్ ఇచ్చింది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉన్న ఆయన్ని వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.. దీంతో అనిల్ నరసరావుపేటలో ఆత్మీయ సమావేశాలు ప్లాన్ చేస్తున్నారు. వాగ్దాటితో ప్రత్యర్థులకి ముచ్చమటలు పట్టించే అనిల్ కుమార్ యాదవ్ ను నిలువరించేందుకు టిడిపి అపసోపాలు పడుతుందని పార్టీలో చేర్చి నడుస్తుంది. ఆయనపై బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని టిడిపి అధినేత చంద్రబాబు భావిస్తున్నారట. దీనికోసం గత కొద్ది రోజుల నుంచి భారీ కసరత్తే చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయల్ని టిడిపిలోకి చేర్చుకొని అనిల్ పై పోటీకి దింపాలని టిడిపి ఆలోచనగా ఉందట..

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం సెంటిమెంట్ నే నమ్ముకుని బరిలోకి దిగుతున్నారు.. యాదవ సామాజిక వర్గ ఓటు ఎక్కువగా ఉన్న నరసరావుపేట ఎంపీ సెగ్మెంట్లో పక్కా ప్లాన్ తో ప్రచారం నిర్వహించాలని ఆయన భావిస్తున్నారట. గతంలో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు.. ఇప్పుడు అదే సెంటిమెంట్ మరోసారి వర్కౌట్
అవుతుందని.. కచ్చితంగా అనీల్ గెలిచి తీరుతారని ఆయన అనుచరులు స్ట్రాంగ్ గా చెబుతున్నారు. దీనిపై వైసీపీ నేతలు లెక్కలు కూడా వేసుకుంటున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 1,10,000 పైగానే ఉన్నాయట. దానికి తోడు ఏడు లక్షలు పైగా ఉన్న బీసీ ఓట్లు కూడా తమకు లాబిస్తాయని.. అనిల్ ని పోటీకి దింపడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల సైతం ఖుషిగా ఉన్నారని పార్టీలో చర్చ నడుస్తుంది.

గతంలో ప్రధాన పార్టీలన్నీ కూడా రెడ్డి లేదా కమ్మ సామాజిక వర్గాన్ని చెందిన అభ్యర్థికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే మొదటిసారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ కార్డుని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. అందుకోసం యాదవ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న అనిల్ ను ఇక్కడి నుంచి పోటీ చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలను తిప్పుకోవాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారట. ఈ ప్లాన్ కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version