వైసిపి రంగుల విషయంలో వైకాపా నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి రావడమే పంచాయతీ భవనాలకు వైసిపి పార్టీ రంగులు వేయటం స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో స్మశానాలు అదేవిధంగా వాటర్ ట్యాంకు లకు ఆఖరికి ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భవనం ఉంటే అక్కడ వాటికీ వైసీపీ రంగులు వేయడం జరిగింది.
అయితే ఈ విషయంలో జగన్ సర్కార్ అతి తెలివి గా వైసిపి రంగుతో పాటు మరో రంగును కలిపి వేయొచ్చని జగన్ సర్కార్ ఇచ్చిన జీవోను తాజాగా హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 623 ను సస్పెండ్ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 19 వాయిదా వేసింది. మొత్తంమీద చూసుకుంటే మూడో దశ లాక్ డౌన్ ముగిసిన వెంటనే హైకోర్టు మరో మొట్టికాయ జగన్ సర్కార్ కి వేయడానికి రెడీగా ఉన్నట్లు అర్థమవుతోంది.