‘ఫ్యాన్స్’ తిరుగుబాటు..వైసీపీకి చిక్కులు!

-

అధికార వైసీపీలో రాజకీయం ఊహించని స్థాయిలో జరుగుతుంది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలకు ఏదొకవిధంగా చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్న వైసీపీకి సొంత తలనొప్పులు పెరిగాయి. అధికార బలం ఉపయోగించుకుని ఓ వైపు చంద్రబాబుని నిలువరించడానికి చూస్తూనే..మరోవైపు పవన్‌కు చెక్ పెట్టడానికి చూస్తుంది. కానీ ప్రతిపక్షాలు ఇంకా గట్టిగా పోరాడుతున్నాయి. అదే సమయంలో సొంత పార్టీలోని కొందరు నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం పెద్ద ఇబ్బందిగా మారింది. ఎలాగో ప్రతిపక్ష పార్టీలు నిత్యం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

ఇక సొంత పార్టీ వాళ్ళు కూడా చేస్తే జగన్ ప్రభుత్వానికి ఇంకా నెగిటివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు జగన్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. వెంకటగిరి బాధ్యతల నుంచి ఆనంని తప్పించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనం ఇంకా వైసీపీకి పూర్తిగా యాంటీ అయ్యేలా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈయన టీడీపీలో చేరతారనే ప్రచారం వస్తుంది.

అటు మైలవరం ఎమ్మెళ్యే వసంత కృష్ణప్రసా సైతం..కాస్త అసంతృప్తిలో ఉన్నారు. ఈయన కూడా వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నారు. అటు మాజీ హోమ్ మంత్రి సుచరిత సైతం పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకే కట్టుబడి ఉంటామని చెబుతూనే..తన భర్త పార్టీ మారితే తాను కూడా మారాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇటు కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ సోదరుడు సుదర్శన్ సైతం షాక్ ఇస్తూ టీడీపీలో చేరారు.

అటు దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సైతం వైసీపీపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వీరే కాదు..ఇంకా కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీట్లు దక్కకపోతే వారు జంపిగ్ అయిపోయేలా ఉన్నారు. మొత్తానికి వైసీపీకి సొంత చిక్కులు ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version