ఢిల్లీ వ్యాప్తంగా అసెంబ్లీ పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ ఎన్నికల తరుణంలో ఆరు గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గాంధీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తూర్పు ఆజాద్ నగర్ పోలింగ్ బూత్‌లోని MCD ప్రతిభా విద్యాలయంలో మాక్ పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.
ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్.
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్.
ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు.
ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు.