పొన్నం: కిషన్ రెడ్డి నామినేటెడ్ బై కేసీఆర్.. ఈ కథ ఏమిటి..?

-

లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి వేళ ప్రధాన పార్టీ నాయకులు మధ్య వార్ నడుస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేశారు రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ దోస్తీ అందరికీ తెలుసని మహారాష్ట్రలో కూల్చిన విధంగా తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం కుదరదని ఫైర్ అయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు బిజెపి బీఆర్ఎస్ కలిసి ఏవో కుట్రలు చేయబోతున్నారని అవన్నీ తమకే తెలుసని అన్నారు బిజెపిని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరినీ జైలుకు పంపారని తెలంగాణ సంపదని ప్రాజెక్టులు పేరుతో దుర్వినియోగం చేసిన కేసీఆర్ ఫ్యామిలీని ఎందుకు బిజెపి పెద్దలు జైలుకి పంపట్లేదని అడిగారు. కిషన్ రెడ్డి నామినేటెడ్ బై కేసీఆర్ అన్నారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ని టచ్ చేసి చూడు అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version