నిరుద్యోగుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి : పొన్నం ప్రభాకర్‌

-

తెలంగాణ వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అనుకున్నామని, ఉద్యోగ ఖాళీలు ప్రకటించమంటే ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని‌పై నిరసన తెలుపడం కోసం మే 8న సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

6వ తేదీ శనివారం ఆయన హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమవారం ప్రియాంక గాంధీ హాజరయ్యే సభకు యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు పొన్నం ప్రభకర్. యువతకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఎప్పుడు అండగా ఉంటుందన్నారాయన. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు పొన్నం. ధాన్యం ఇంకా కొనుగోలు చేయకపోవడం వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version