BREAKING : కోర్టు విచారణకు హాజరైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

-

2018 లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పరువు నష్టం దావా కేసు విచారణలో భాగంగా సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యూహంలో భాగంగా లిక్కర్ స్కామ్ పై చర్చ అన్నారు. కవిత అరెస్ట్ కు జాప్యం ఎందుకు జరుగుతుందో బీజేపీ చెప్పాలని… మహిళ లోకం తలవంపులు తెచ్చేలా కవిత లిక్కర్ స్కామ్ చేస్తుందని ఫైర్‌ అయ్యారు.

అవినీతి ఎవరు పాల్పడ్డ శిక్షిస్తా అని చెప్పిన సీఎం కేసీఆర్ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉన్నా ఎందుకు పార్టీ నుండి బహిష్కరించట్లేనని.. ప్రజా సమస్యలు గాలికొదిలేసి పెంక్షన్లు రాక, ఉద్యోగులకు జీతాలు రాక, ఆర్ధిక సంక్షోభం లో తెలంగాణ ఉందన్నారు. అధికార పార్టీ పై ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ వ్యూహాలు చేస్తుందని.. తెలంగాణ ప్రజల కొరకు 9 సంవత్సరలో ఏమి చేశారో చెప్పి ఎన్నికలలోకి పోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమి లేదని.. 9ఏండ్లలో ఏమి చేశారో శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రుణ మాఫీ, ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version