ఉడతతో పూజా హెగ్దే గేమ్స్..వీడియో వైరల్…!

-

హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తోంది. చెట్ల వద్ద ఉన్న ఉడతకు నట్స్‌ తినిపించేందుకు తెగ భయపడ్డారట. నాలుగు సార్లు ఉడతకు భయపడి విఫలమయ్యానని… చివరికి ఐదో సారి మాత్రం ధైర్యం చేసి నట్స్‌ తినిపించానని చెప్తోంది ఈ ముద్దుగుమ్మ. ఉడతకు నట్స్‌ తినిపించిన వీడియో షేర్‌ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

ఈ భామ ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూజా ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా ముగింపు దశలో వుంది. పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ను రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version