Pooja Hegde : వైట్ డ్రెస్​లో ఏంజిల్​లా బుట్టబొమ్మ

-

టాలీవుడ్ బుట్టబొమ్మ.. అదేనండి పూజా హెగ్డే.. ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్​లో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ భామ ఆ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది.

ఇంత బిడీ షెడ్యూల్​లోనూ పూజా.. ఓ ఈవెంట్​కు హాజరైంది. ఈ ఈవెంట్​లో పూజ వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించింది. ఈ ఔట్​ఫిట్​లో బుట్టబొమ్మ అచ్చం ఏంజిల్​లా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బుట్టబొమ్మ తర్వగా తెలుగులో ఓ సినిమా చేయమంటూ రిక్వెస్టులు పెడుతున్నారు.

ఒక లైలా కోసం సినిమాతో పూజ టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఇక అక్కడి నుంచి ఈ భామకు తిరుగులేకుండా అయిపోయింది. చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఒక దశలో ఈ బ్యూటీ నిర్మాతల ఫస్ట్ ఛాయిస్. ఒకే డైరెక్టర్​తో హ్యాట్రిక్ కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి.

కానీ గత కొంతకాలంగా పూజకు బ్యాడ్ లక్ నడుస్తోంది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ బ్యూటీ బాలీవుడ్​కు మకాం మార్చింది. మరి అక్కడైనా బుట్టబొమ్మ దశ తిరుగుతుందా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version