టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోన్న ఈ అమ్మడు..బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ షూటింగ్స్ లో పాల్గొంటోంది. ఈ సుందరి నటించిన ‘బీస్ట్’ చిత్రం ఈ నెల 13న విడుదల కాగా, ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. అయితే, తలపతి విజయ్ ‘బీస్ట్’ పిక్చర్ అనుకున్న స్థాయిలో లేదని విజయ్ అభిమానులు అంటున్నారు.
గతంలో ‘జిగేలు రాణి’ అనే స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డే..F3 ఫిల్మ్ లో మళ్లీ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ సంగతులు పక్కనబెడితే తాజాగా ఈ భామ ‘బీస్ట్’ ప్రమోషన్స్ లో భాగంగా దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ వెరీ హాట్ గా , బోల్డ్ గా పూజా హెగ్డే కనిపిస్తోంది.
డిజైనర్ శారీలో, డీప్ నెక్ జాకెట్ లో క్లియర్ క్లీవేజ్ షో తో పాటు బ్యాక్ చూపుతూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. బ్యూటీ అండ్ ద బీస్ట్ అనే క్యాప్షన్ తో పూజా హెగ్డే తన ఫొటోలు షేర్ చేయగా అవి చూసి నెటిజన్లు ‘వావ్ ..లవ్ యూ, సూపర్ డార్లింగ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలను బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత లైక్ చేయడం విశేషం. పూజా హెగ్డే ‘ఆచార్య’ చిత్రంలో హాఫ్ శారీలో రామ్ చరణ్ కు జోడీగా చక్కటి అభినయం కనబర్చినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.