సెట్‌లో ఎంటరయ్యామా.. అంటే చకచకా పనులు కావాల్సిందే. లేదంటే కొందరు హీరో హీరోయిన్లకు పిచ్చెక్కిపోతుంది. ఎదురుచూపులు చూడటం అంటే మహా చెడ్డ చిరాకుగా ఉంటుంది. అసలే సమయం విలువైనది అంటారు.. అలాంటిది క్షణం తీరిక లేకుండా గడిపే హీరోయిన్లకు వెయిట్ చేయడం అంటే మతిపోతుంది. తాజాగా పూజా హెగ్డేకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది.
పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. కరోనాకు ఏమాత్రం బయటపడకుండా చిత్రయూనిట్ విదేశాల్లో తిరుగుతోంది. జార్జియాలో మాస్క్ కట్టుకుని ఎయిర్ పోర్ట్‌లో ఎదురుచూస్తున్న ఫోటోను పూజా హెగ్డే షేర్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ మూవీ సెట్‌లో పూజా హెగ్డే ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందంట. అయితే ఇక ఖాళీగా ఉన్న ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచక.. ఏవో పాటలు ప్లే చేసుకుంటూ తల అడ్డంగా ఊపుకుంటూ బుంగమూతి పెట్టింది, క్యూట్ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫస్ట్ లుక్ త్వరలోనే రాబోతోందని తాజాగా డైరెక్టర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.