బన్నీకి బాస్ గా పూజా….??

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ అలవైకుంఠపురములో. మంచి ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ మరియు ఎమోషనల్ అంశాలు కలబోతగా త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఇప్పటికే బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి హిట్ సాధించి ఉండడంతో, వీరిద్దరూ ఈ సారి అలవైకుంఠపురములో సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు.

ఇటీవల నాపేరు సూర్యతో ఫ్యాన్స్ ని నిరాశ పరిచిన బన్నీ, ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలని ఎంతో కసితో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ టీజర్ మరియు రెండు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, అత్యధిక వ్యూస్ దక్కించుకుని ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ సంపాదించాయి. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు బయటకు వచ్చిన వార్తలను బట్టి చూస్తుంటే అది నిజమేనని, అంతేకాక ఈ సినిమాలో పూజ హెగ్డే, సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ ‘అల’ గా నటిస్తోందని, అలానే ఆమె కంపెనీలోనే హీరో కూడా ఎంప్లాయ్ గా పనిచేస్తుంటాడని టాక్.

అయితే దీని పై సినిమా యూనిట్ నుండి ఎటువంటి కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా రాలేదు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ డేటైన 2020 జనవరి 12వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా నుండి థమన్ స్వరపరిచిన డాడీ డాడీ అనే లిరికల్ సాంగ్ అతి త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ కానుంది. మరి ఎంతో కష్టపడుతున్న బన్నీకి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందిస్తుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version