“డానియల్ శేఖర్” పాత్రలో కొడాలి నాని : పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

-

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చూడ్డానికి ముద్దుగుమ్మ లా ఉండే ఈ బ్యూటీ కి అవకాశాలు మాత్రం అనుకున్నట్టు రాలేదు. అంతే కాకుండా ఇతర వివాదాలు కూడా పూనమ్ కెరీర్ ను దెబ్బ తీసాయని ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే పూనమ్ సోషల్ మీడియా లో ఆసక్తికర ట్వీట్ లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో లోనే తాజాగా భీమ్లా నాయక్‌,కొడాలి నానిపై సంచలన ట్వీట్‌ చేసింది పూన్‌ కౌర్‌. ఆమె చేసిన ట్వీట్‌ వివాదానికి దారి తీసేలానే ఉంది. ఏపీ మంత్రి కొడాలి నాని మీద పూనమ్‌ కౌర్‌ కౌంటర్‌ వేస్తూ.. ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం.

భీమ్లా నాయక్‌ సినిమాలో డానియల్‌ శేఖర్‌ {మతం మార్చుకున్న క్రిస్టియన్‌ } పాత్రలో కొడాలి నాని నటిస్తే.. ఏపీలో భీమ్లా నాయక్‌ బ్లాక్‌ బస్టర్‌ అయ్యేదంటూ పేర్కొంది. అలాగే.. ఈ ట్వీట్‌ కు జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అంటూ ఓ హ్యాష్‌ ట్యాగ్‌ కూడా వేసింది. మొత్తానికి ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌ గా మారింది. అయితే.. కొద్ది సేపటికే.. ఈ ట్వీట్‌ ను డిలీట్‌ చేసింది పూనమ్‌. దీంతో ఈ ట్వీట్‌ ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version